ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్.. భారీ తగ్గింపు ధరలకు ఫోన్లు..


Mon,June 17, 2019 05:01 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో ఇవాళ మొబైల్స్ బొనాంజా సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 21వ తేద వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు ప్రముఖ బ్లాండ్లకు చెందిన ఫోన్లను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. సేల్‌లో అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 (4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్) ఫోన్‌ను రూ.4వేల తగ్గింపుతో రూ.8,499 కే కొనుగోలు చేయవచ్చు. అలాగే హానర్ 9ఎన్ రూ.15,999 కు బదులుగా రూ.8,999 కే లభిస్తున్నది.

సేల్‌లో భాగంగా నోకియా 6.1 (3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) ఫోన్‌ను రూ.6,999 కే కొనుగోలు చేయవచ్చు. అలాగే హానర్ 9ఐ (4జీబీ, 64 జీబీ) రూ.8,999 ధరకు, హానర్ 10 లైట్ రూ.9,999 కు, యాపిల్ ఐఫోన్ X (64జీబీ) రూ.66,499 ధరకు లభిస్తున్నాయి. ఇక సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్, బై బ్యాక్ గ్యారంటీ తదితర ఇతర ఆఫర్లను కూడా అందిస్తున్నారు.

2982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles