ఈ నెల 19 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్‌ డే సేల్‌


Tue,January 14, 2020 01:11 PM

ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 19 నుంచి 22వ తేదీ వరకు రిపబ్లిక్‌ డే సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఐసీఐసీఐ లేదా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా అందివ్వనున్నారు. దీంతోపాటు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు జనవరి 18వ తేదీ రాత్రి 8 గంటల నుంచే సేల్‌ అందుబాటులోకి రానుంది.

ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో ప్రతి 8 గంటలకు ఒకసారి బెస్ట్‌ డీల్స్‌ను అందివ్వనున్నారు. ఎలక్ట్రానిక్స్‌, యాక్ససరీలపై 80 శాతం, స్మార్ట్‌వాచ్‌లపై 50 శాతం, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం, ఫ్లిప్‌కార్ట్‌ బ్రాండ్లపై 80 శాతం వరకు రాయితీలను అందివ్వనున్నారు.

998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles