టిక్‌టాక్ లైకుల కోసం.. ఉరి వేసుకునేందుకు యత్నించి..! వీడియో..!


Tue,July 16, 2019 03:38 PM

నేటి తరుణంలో సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిచినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. ప్రాణాలు పోయేందుకు అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని జనాలకు కావల్సినంత కాలక్షేపం, వినోదం దొరుకుతున్నాయి. అయితే జనాలను ఎంటర్‌టైన్ చేయలని చెప్పి.. లైకుల కోసం, షేర్ల కోసం కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం బాగా పాపులర్ అయిన టిక్‌టాక్ యాప్‌లో యువత, పిల్లలు వ్యూస్, లైకుల కోసం వెన్నుపూసలో వణుకు పుట్టించే పనులు చేస్తున్నారు.


పైన చూపిన వీడియోలో ఓ బాలిక టిక్‌టాక్‌లో వీడియో కోసం సీలింగ్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాలని యత్నించింది. కానీ ఆ ప్రయోగం విఫలమై.. చివరకు ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు చూశారు కాబట్టి సరిపోయింది.. లేకపోతే ప్రాణాలు పోయుండేవి.. తల్లిదండ్రులు ఇకనైనా తమ పిల్లలు స్మార్ట్‌ఫోన్లలో ఏం చేస్తున్నారో, సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారో కచ్చితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు..!

9604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles