నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్.. అదుర్స్..!


Thu,September 19, 2019 12:08 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 7.2ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం నోకియాకు చెందిన మిడ్‌రేంజ్ ఫోన్లలో ఇదే లేటెస్ట్ ఫోన్ కావడం విశేషం. కాగా ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ వాటర్‌డ్రాప్ ప్యూర్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ దీనికి త్వరలో లభించనుంది.

నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు ముందు, వెనుక భాగాల్లో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో డ్యుయల్‌సిమ్, మైక్రోఎస్‌డీ కార్డుల కోసం డెడికేటెడ్ స్లాట్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ క్యాన్ గ్రీన్, చార్‌కోల్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.18,599 గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.19,599గా ఉంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.


లాంచింగ్ సందర్భంగా నోకియా 7.2 ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కన్‌జ్యూమర్ ఫైనాన్స్ పద్ధతిలో కొనుగోలు చేసినా 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే బజాజ్ ఫైనాన్స్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కన్‌జ్యూమర్ ఫైనాన్స్‌లతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే జీరో డౌన్ పేమెంట్‌కే ఈ ఫోన్‌ను అందిస్తారు. అందుకు గాను ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీని వసూలు చేయరు. ఈ ఆఫర్ కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అలాగే జియో కస్టమర్లకు ఈ ఫోన్‌పై రూ.198, రూ.299 రీచార్జిలతో రూ.7,200 విలువైన ప్రయోజనాలు అందుతాయి.

నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఈఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.2వేల విలువైన గిఫ్ట్ కార్డు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను ఇస్తారు. ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఈ నెల 29వ తేదీ నుంచి జరగనున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఈఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఇక అంతకు ముందు తెలిపిన ఆఫర్లన్నీ అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

నోకియా 7.2 ఫీచర్లు...
* 6.39 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
* 64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై
* 48, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
* 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గూగుల్ అసిస్టెంట్ బటన్
* నోటిఫికేషన్ ఎల్‌ఈడీ, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

2063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles