రూ.13,999కే హానర్‌ 9ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌


Tue,January 14, 2020 05:56 PM

మొబైల్స్‌ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్‌ హానర్‌ 9ఎక్స్‌ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ఇందులో.. 6.59 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ కైరిన్‌ 710ఎఫ్‌ ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, 48, 8, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 16 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్‌ సి, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్‌ను జనవరి 19వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles