నూతన తరహా ఎయిర్‌బ్యాగులను డెవలప్ చేసిన హుండాయ్


Wed,September 18, 2019 03:28 PM

ప్రముఖ ఆటోమొబైల్స్ కంపెనీ హుండాయ్ మోటార్ గ్రూప్ నూతన తరహా ఎయిర్‌బ్యాగులను తాజాగా డెవలప్ చేసింది. ఇవి ప్రస్తుతం హుండాయ్ కార్లలో ఉన్న ఎయిర్‌బ్యాగుల కన్నా చాలా తక్కువ బరువును కలిగి ఉండడంతోపాటు వాహనదారులకు మరింత సౌకర్యాన్నిస్తాయి. కొత్తగా రానున్న హుండాయ్ కార్లలో ఈ ఎయిర్‌బ్యాగులను ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ ఎయిర్‌బ్యాగులను ముందు వరుసలో డ్రైవర్, ప్యాసింజర్‌కు మధ్యలో ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగినప్పడు వెంటనే ఎయిర్‌బ్యాగులు తెరుచుకుంటాయి. దీంతో డ్రైవర్, ప్యాసింజర్‌లు ఇద్దరూ ఒకరికొకరు ఢీకొట్టకుండా ఉంటారు. అలాగే తలకు మరింత రక్షణ లభిస్తుంది. ఇక ప్యాసింజర్ లేనప్పుడు డ్రైవర్‌కు ఆ ఎయిర్‌బ్యాగుల వల్ల అవతలి వైపు నుంచి వాహనానికి కలిగే ప్రమాదం నుంచి రక్షణ లభిస్తుంది. కాగా ఈ నూతన ఎయిర్‌బ్యాగులతో తలకు జరిగే గాయాల నుంచి 80 శాతం వరకు రక్షణ లభిస్తుందని హుండాయ్ చెబుతోంది. 2020లో రానున్న తన కార్లలో హుండాయ్ ఈ ఎయిర్‌బ్యాగులను వాహనదారులకు అందివ్వనుంది.

831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles