మీరు ఇన్‌బాక్స్ బై జీమెయిల్ యూజరా? మీరు జీమెయిల్‌కు మారాల్సిందే!


Thu,March 21, 2019 02:25 PM

మీరు ఇన్‌బాక్స్ బై జీమెయిల్ యూజర్లా? మీకో బ్యాడ్ న్యూస్. ఏప్రిల్ 2 నుంచి మీకు ఇన్‌బాక్స్ యాప్ ఉండదు. ఇన్‌బాక్స్ ద్వారా మీ మెయిల్స్‌ను యాక్సెస్ చేసుకోలేరు. ఎందుకంటే ఏప్రిల్ 2 న దాన్ని గూగుల్ షట్‌డౌన్ చేసేస్తోంది. వచ్చే నెలలో గూగుల్ షట్ డౌన్ చేసే వాటిలో గూగుల్ ప్లస్ ఒక్కటే కాదు.. ఇన్‌బాక్స్ బై జీమెయిల్ యాప్ కూడా ఉంది. గత సంవత్సరమే ఈ యాప్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్టు గూగుల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎప్పుడు దాన్ని క్లోజ్ చేస్తుందో మాత్రం తెలియజేయలేదు. తాజాగా దాన్ని షట్‌డౌన్ చేసే తేదీని వెల్లడించింది. మీరు ఒకవేళ ఇన్‌బాక్స్ యూజర్లయితే.. ఇంకో 12 రోజులు మాత్రమే దాన్ని యాక్సెస్ చేసుకోగలరు.

ఇన్‌బాక్స్ బై గూగుల్, గూగుల్ ప్లస్ రెండు ప్లాట్‌ఫాంలను ఒకేరోజు అంటే ఏప్రిల్ 2న గూగుల్ షట్ డౌన్ చేస్తోంది. ఈ యాప్ ఉపయోగిస్తున్న వాళ్లకు గూగుల్ నోటిఫికేషన్ పంపిస్తుంది. 2014లో ఈ యాప్‌ను గూగుల్ లాంచ్ చేసింది. ప్రతి రోజు ఎక్కువగా మెయిల్స్‌తో పని చేసే వాళ్ల కోసం రూపొందించిందే ఈ యాప్. ఈ మెయిల్ యాప్ ద్వారా యూజర్లకు ఆటోమెటిక్‌గా రిప్లయిలు, ఒకేసారి వేల మెయిల్స్ పంపించుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఈయాప్ ద్వారా ఎక్కువ పనిని తక్కువ సమయంలో చేయొచ్చు. రెండు వారాల కింద కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఇన్‌బాక్స్ యాప్ కొంతమంది యూజర్లకు డౌన్‌లోడ్ కాలేదు. ఇన్‌బాక్స్ బై జీమెయిల్‌లో స్మార్ట్ రిప్లయి, నడ్జెస్, ఇన్‌లైన్ అటాచ్‌మెంట్స్ లాంటి స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. అయితే.. ఈ ఫీచర్స్ జీమెయిల్ యాప్‌లో ఉండవు.

2844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles