జాబ్రా ఎలైట్ 85హెచ్ వైర్‌లెస్ హెడ్‌సెట్ విడుద‌ల


Wed,May 22, 2019 02:06 PM

జాబ్రా కంపెనీ ఎలైట్ 85హెచ్ పేరిట ఓ నూత‌న వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను భార‌త మార్కెట్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో జాబ్రా హియర్ త్రూ టెక్నాల‌జీని ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఈ హెడ్‌సెట్ నుంచి వ‌చ్చే సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేష‌న్ ఫీచ‌ర్ ఉన్నందున ఈ హెడ్‌సెట్ పెట్టుకుంటే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చే శబ్దాలు బాగా త‌గ్గుతాయి. అస్స‌లు విన‌బ‌డ‌వు. అలాగే ఈ హెడ్‌సెట్‌లో 40 ఎంఎం డ్రైవ‌ర్ యూనిట్‌ను ఏర్పాటు చేసినందున సౌండ్ అవుట్ పుట్ బాగుంటుంది. ఈ హెడ్‌సెట్‌ను ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే దీన్ని 36 గంట‌ల పాటు నాన్‌స్టాప్ గా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ హెడ్‌సెట్‌కు ఐపీ52 డ‌స్ట్ అండ్ రెయిన్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఇక ఈ హెడ్‌సెట్ రూ.28,999 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ఈ నెల 25వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

1219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles