రూ.7,999కే లావా జడ్93 స్మార్ట్‌ఫోన్


Sat,August 24, 2019 06:49 PM

మొబైల్స్ తయారీదారు లావా.. జడ్93 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.7,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ఫోన్‌తో జియో రూ.198, రూ.299 రీచార్జిల ద్వారా 50 జీబీ వరకు అదనపు డేటాను ఇస్తున్నది. అలాగే రూ.1200 వరకు క్యాష్‌బ్యాక్ కూడా జియో నుంచి లభిస్తుంది.

లావా జడ్93 స్మార్ట్‌ఫోన్‌లో... 6.22 ఇంచ్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

3018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles