ఈ కారు.. మాట్లాడుతుంది..!


Mon,August 5, 2019 07:08 PM

ప్రస్తుత తరుణలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.. మనకు అసాధ్యమైన ఎన్నో పనులను టెక్నాలజీ సుసాధ్యం చేస్తోంది.. దీంతో మన జీవన విధానం మరింత సుఖవంతమవుతోంది.. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇక ఆటోమొబైల్ రంగంలోనూ మనం ఆధునిక టెక్నాలజీని చూస్తున్నాం. ఈ క్రమంలోనూ టెక్నాలజీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కలగలిపిన వాహనాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో తాజాగా విడుదలైన ఎంజీ హెక్టార్ కూడా ఒకటి..!

ఎంజీ హెక్టార్.. ఇంటర్నెట్ ఇన్‌సైడ్.. అనే క్యాప్షన్‌తో ఇటీవలే భారత మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ కారుకు ప్రస్తుతం మన దగ్గర డిమాండ్ బాగా ఉంది. ఇప్పుడు ఆర్డర్ చేసిన వారు ఈ కారు కావాలంటే కనీసం 6-7 నెలలు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. అంతలా ఈ కారు వాహనదారులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ కారు అంతగా ఆకర్షించడానికి కారణం.. అందులో వినియోగదారులకు లభిస్తున్న ఫీచర్లే అని చెప్పవచ్చు. మరి ఆ ఆకట్టుకునే ఫీచర్లు ఏమిటంటే...100కు పైగా వాయిస్ కమాండ్లు...


ఎంజీ హెక్టార్‌లో 100కు పైగా వాయిస్ కమాండ్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. కారు లైట్లను ఆన్ చేయమని చెప్పడం మొదలుకొని కారు సైడ్ మిర్రర్‌లను ఓపెన్, క్లోజ్ చేయడం, స్టీరియో ఆన్ చేయడం, ఏసీ ఆన్/ఆఫ్ చేయడం, డిక్కీ ఓపెన్, క్లోజ్ చేయడం, సన్‌రూఫ్‌ను ఓపెన్, క్లోజ్ చేయడం.. వంటి అనేక పనులను మనం ఇందులోని వాయిస్ కమాండ్లతోనే చేసుకోవచ్చు.

ఇతర ఫీచర్లు...


ఎంజీ హెక్టార్‌లో ఆకట్టుకుంటున్న ఫీచర్లలో సేఫ్టీ ఫీచర్ కూడా ఒకటి. ఇందులో అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన ఎయిర్‌బ్యాగులను అమర్చారు. ప్రమాద సమయాల్లో ఇవి అత్యంత వేగంగా తెరుచుకుంటాయి. ఇక ఈ కారుకు గాను ఓ యాప్‌ను కూడా అందిస్తున్నారు. ఆ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే అందులో కారు ఎంత వేగంతో వెళ్తుంది, ఎక్కడ ఉంది అన్న వివరాలు తెలుస్తాయి. దీంతో ఈ కారును ఇతరులకు ఇచ్చినా.. వారు ఏ వేగంతో వెళ్తున్నారో, ఎక్కడ ఉన్నారో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర వల్ల కారుకు రక్షణ లభిస్తుంది.ఇక కారులో ఉండే స్క్రీన్‌పై ఆక్యువెదర్ సహాయంతో వాతావరణ విశేషాలు తెలుసుకోవచ్చు. జీపీఎస్ కూడా ఉన్నందున మ్యాప్ సహాయంతో ఎక్కడ ఉన్నామో సులభంగా తెలిసిపోతుంది. దీంతో దారులను వెతకడం సులభతరమవుతుంది. ఇక ఈ కారుకు రివర్స్ గేర్ సెన్సార్లను అద్భుతంగా ఇచ్చారు. ఈ క్రమంలో రివర్స్‌లో వెళ్లినప్పుడు కారులో ఉండే స్క్రీన్‌పై ఓ వర్చువల్ బాక్స్ కారు చుట్టూ వస్తుంది. దీంతో కారును కచ్చితమైన ప్లేస్‌లో సులభంగా రివర్స్‌లో పెట్టవచ్చు. రివర్స్ తీయవచ్చు. కాగా ఎంజీ హెక్టార్ కారు ఎక్స్ షో రూం ఆరంభ ధర రూ.14.47 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ ధర రూ.20.16 లక్షలుగా ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వెర్షన్లలో ఈ కారు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

4938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles