రూ.13,999కే మోటోరోలా 32 ఇంచుల ఆండ్రాయిడ్ టీవీ


Mon,September 16, 2019 03:01 PM

మొబైల్స్ తయారీదారు మోటోరోలా భారత మార్కెట్‌లో చవక ధరలకే పలు ఆండ్రాయిడ్ టీవీలను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 32, 43, 50, 55, 65 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ఈ టీవీలు వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటిల్లో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను కామన్‌గా అందిస్తున్నారు. ఇక 32 ఇంచుల హెచ్‌డీ రెడీ టీవీ ధర రూ.13,999 ఉండగా, 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ టీవీ ధర రూ.24,999గా ఉంది. అలాగే 43 ఇంచుల 4కె టీవీ ధర రూ.29,999గా, 50 ఇంచుల 4కె టీవీ ధర రూ.33,999గా, 55 ఇంచుల 4కె టీవీ ధర రూ.39,999గా ఉంది. ఇక చివరిగా 65 ఇంచుల 4కె టీవీ ధ‌ర‌ను రూ.64,999గా నిర్ణ‌యించారు. వీటిని ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో విక్రయించనున్నారు.

2772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles