అదిరిపోయే ఫీచర్లతో మళ్లీ వచ్చిన మోటోరోలా రేజర్ స్మార్ట్‌ఫోన్..!


Thu,November 14, 2019 03:56 PM

మొబైల్స్ తయారీదారు మోటోరోలాకు చెందిన మోటోరోలా రేజర్ స్మార్ట్‌ఫోన్ ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. అయితే అదే ఫోన్‌ను ఇప్పుడు మళ్లీ రీడిజైన్ చేసి ఆండ్రాయిడ్ ఓఎస్‌తో రీలాంచ్ చేశారు. ఈ క్రమంలో కొత్త మోటోరోలా రేజర్ ఫోన్ ఇప్పుడు అమెరికా మార్కెట్‌లో విడుదలైంది.

మోటోరోలా రేజర్ (2019) స్మార్ట్‌ఫోన్‌ను సాంప్రదాయ ఫ్లిప్ డిజైన్‌లో రూపొందించారు. దీంతో ఒకప్పటి మోటోరోలా రేజర్ ఫోన్ లుక్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇక ఈ ఫోన్‌లో 6.2 ఇంచుల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీన్ని సగం వరకు మడతబెట్టవచ్చు. అలాగే క్విక్ వ్యూ కోసం 2.7 ఇంచుల మరో సెకండరీ డిస్‌ప్లేను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. అందులో యూజర్లు నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. సెల్ఫీలు తీసుకోవచ్చు. మ్యూజిక్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు. దీనికి తోడు అదనంగా మరో 5 మెగాపిక్సల్ కెమెరాను కూడా ఫోన్‌లో ఏర్పాటు చేశారు.

మోటోరోలా రేజర్ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 9.0 స్టాక్ ఓఎస్‌ను అందిస్తున్నారు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 2510 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ తదితర ఇతర ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో కేవలం ఇ-సిమ్ కార్డులకు మాత్రమే సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0 ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌ను జనవరి 9, 2020 నుంచి విక్రయించనున్నారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్లను ప్రారంభించనున్నారు. ఈ ఫోన్ ధర 1499.99 డాలర్లు (దాదాపుగా రూ.1,07,400)గా ఉంది.

3644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles