రూ.3,999కే నాయిస్ షాట్స్ ఎక్స్-బడ్స్


Thu,September 19, 2019 04:08 PM

ప్రముఖ వియరబుల్, స్మార్ట్‌ఫోన్ యాక్ససరీస్ తయారీదారు నాయిస్.. షాట్స్ ఎక్స్-బడ్స్ పేరిట నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ సహాయంతో మ్యూజిక్ వినవచ్చు. అందుకుగాను వీటికి పలు కంట్రోల్స్‌ను కూడా అందిస్తున్నారు. అలాగే కాల్స్ కూడా ఆన్సర్ చేయవచ్చు. బ్లూటూత్ 5.0 ఆధారంగా ఈ ఇయర్‌బడ్స్ పనిచేస్తాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్లకు ఈ బడ్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను వీటికి అందిస్తున్నారు. వీటిని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 4 గంటలకు పైగా నాన్‌స్టాప్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ఇయర్ బడ్స్‌ను రూ.3,999 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles