నేటి నుంచి నోకియా 7.2 ఫోన్ల విక్రయం


Mon,September 23, 2019 11:20 AM

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్‌ను గత వారం భారత్‌లో విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆ ఫోన్‌కు గాను ఇవాళ సేల్‌ను ప్రారంభించారు. ఇప్పటికే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

కాగా నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్ 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.18,599, రూ.19,599 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. జియో వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.7200 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles