ఇప్పుడు గూగుల్ పే యాప్‌లోనూ రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవ‌చ్చు


Tue,March 19, 2019 05:50 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన గూగుల్ పే యాప్ ద్వారా న‌గ‌దు బ‌దిలీలు, బిల్ పేమెంట్స్‌, రీచార్జిలు చేసుకోవ‌చ్చ‌న్న విష‌యం విదిత‌మే. కాగా ప్ర‌స్తుతంలో అందులో క్యాబ్‌, బ‌స్ టిక్కెట్ బుకింగ్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. అయితే ఇక‌పై గూగుల్ పే యాప్‌లో ట్రెయిన్ టిక్కెట్ల‌ను కూడా బుక్ చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ రైల్వేస్‌తో భాగ‌స్వామ్యం అయిన గూగుల్ ఐఆర్‌సీటీసీతో క‌ల‌సి రైలు టిక్కెట్ల‌ను బుక్ చేసుకునే స‌దుపాయాన్ని ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. అయితే గూగుల్ పే యాప్ ద్వారా రైలు టిక్కెట్ల‌ను బుక్ చేసుకుంటే ఎలాంటి అద‌న‌పు చార్జిల‌ను చెల్లించాల్సి ప‌నిలేద‌ని ఐఆర్‌సీటీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ల‌భిస్తున్న గూగుల్ పే యాప్‌లో యూజ‌ర్లు ప్ర‌స్తుతం ట్రెయిన్ టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు..!

1774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles