ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వ‌న్‌ప్ల‌స్ 7 సిరీస్ ఫోన్లు..!


Wed,May 15, 2019 01:04 PM

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్లు వ‌న్ ప్ల‌స్ 7, 7 ప్రొల‌ను నిన్న రాత్రి విడుద‌ల చేసింది. బెంగ‌ళూరు, లండ‌న్‌, న్యూయార్క్ న‌గ‌రాల్లో భార‌త కాల‌మానం ప్ర‌కారం.. నిన్న‌రాత్రి 8.15 గంట‌ల‌కు వ‌న్‌ప్ల‌స్ ఈవెంట్ జ‌ర‌గ్గా అందులో వ‌న్‌ప్ల‌స్ 7 సిరీస్ ఫోన్ల‌ను లాంచ్ చేశారు. ఇక ఈ రెండు ఫోన్ల‌లోనూ ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

వ‌న్‌ప్ల‌స్ 7 స్మార్ట్‌ఫోన్‌లో 6.41 ఇంచుల ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనిపై భాగంలో నాచ్ ఉంటుంది. అలాగే డిస్‌ప్లే కింది భాగంలో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. అలాగే 8 జీబీ ర్యామ్ ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 48, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉండ‌గా, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బ్యాక్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల ఫోన్ కింద‌ప‌డినా ఏమీ కాదు. ప‌గ‌ల‌కుండా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఈ ఫోన్‌లో అమ‌ర్చ‌గా, దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

ఇక వన్‌ప్ల‌స్ 7 ప్రొ ఫోన్‌లో 6.67 ఇంచుల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా, దీనికి ఎలాంటి నాచ్ లేదు. ఇక ఈ ఫోన్‌లోనూ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 12 జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్‌, 16 మెగాపిక్స‌ల్ పాప‌ప్ సెల్ఫీ కెమెరా, వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెమెరా, వెనుక బాడీకి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌కు వాట‌ర్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ఫోన్ 0 నుంచి 48 శాతం చార్జింగ్ అయ్యేందుకు కేవ‌లం 20 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంది.


వ‌న్ ప్ల‌స్ 7 ఫీచ‌ర్లు...


6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

వన్‌ప్ల‌స్ 7 ప్రొ ఫీచ‌ర్లు...


6.67 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్, 6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 8, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

ధ‌ర‌లు...


వ‌న్‌ప్ల‌స్ 7 స్మార్ట్‌ఫోన్ మిర్ర‌ర్ గ్రే, రెడ్ క‌ల‌ర్ వేరియెంట్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర‌ను రూ.32,999 గా నిర్ణ‌యించారు. అలాగే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర‌ను రూ.37,999 గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్‌ను జూన్ నెల నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఇక వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ నెబ్యులా బ్లూ, మిర్ర‌ర్ గ్రే, ఆల్మండ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా, ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర‌ను రూ.48,999 గా నిర్ణ‌యించారు. అలాగే ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.52,999గా ఉండ‌గా, టాప్ ఎండ్ వేరియెంట్ (12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌) ధ‌రను రూ.57,999గా నిర్ణ‌యించారు. కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లు అమెజాన్‌, వ‌న్‌ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్లు, వ‌న్‌ప్ల‌స్ ఎక్స్‌క్లూజివ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌, రిల‌య‌న్స్ డిజిట‌ల్ స్టోర్లు, మై జియో స్టోర్లు, క్రోమా స్టోర్ల‌లో ఈ నెల 17వ తేదీ నుంచి ల‌భ్యం కానున్నాయి. అలాగే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ఈ నెల 28వ తేదీ నుంచి ల‌భ్యం కానుండ‌గా.. లాంచింగ్ సంద‌ర్భంగా ఈ ఫోన్ల‌పై ప‌లు ఆఫర్ల‌ను కూడా అందిస్తున్నారు.

ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉప‌యోగించి ఈ ఫోన్ల‌ను కొనుగోలు చేస్తే రూ.2వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ అందిస్తారు. అలాగే జియో ఈ ఫోన్ల‌పై త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.9300 విలువైన బెనిఫిట్స్‌ను అందివ్వ‌నుంది. దీంతోపాటు స‌ర్విఫైలో ఈ ఫోన్ల‌ను ఎప్పుడైనా ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఫోన్ విలువ‌లో 70 శాతం వ‌ర‌కు బై బ్యాక్ వాల్యూ పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్ల‌పై 6 నెల‌ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ల‌ను కూడా అందిస్తున్నారు.2205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles