బెంగళూరులో వన్‌ప్లస్ 3వ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్


Sun,September 22, 2019 12:42 PM

మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్.. బెంగళూరులో తన 3వ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను ప్రారంభించింది. బెంగళూరులోని కోరమంగళలో ఉన్న ఫోరం మాల్‌లో ఈ స్టోర్‌ను వన్‌ప్లస్ లాంచ్ చేసింది. కాగా 2017 జనవరిలో బెంగళూరులో తన మొదటి ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను ప్రారంభించిన వన్‌ప్లస్ ఇప్పుడు 3వ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే 2020 వరకు దేశంలోని 50 నగరాల్లో 100 వరకు ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్‌ను ప్రారంభించడమే లక్ష్యంగా వన్‌ప్లస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇక కొత్తగా లాంచ్ అయిన ఈ స్టోర్‌లో వినియోగదారులకు పలు ఆఫర్లను అందిస్తున్నారు.

బెంగళూరులోని నూతన వన్‌ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను విజిట్ చేసే కస్టమర్లకు పలు ఆఫర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలో వారు వన్‌ప్లస్ 7 ఫోన్లను అందులో కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు అదనంగా ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను ఇస్తున్నారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ విధానంలో ఈ ఫోన్లను కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు. ఈ రోజు స్టోర్‌లో వన్‌ప్లస్ ఫోన్లను కొంటే వన్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను అందిస్తున్నారు.

551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles