8 న‌గ‌రాల్లో వ‌న్‌ప్ల‌స్ 7టి పాప‌ప్ ఈవెంట్లు


Sun,September 22, 2019 07:04 PM

మొబైల్స్ త‌యారీదారు వ‌న్ ప్ల‌స్ భార‌త్‌లో వ‌న్‌ప్ల‌స్ 7టి ఫోన్‌తోపాటు వ‌న్ ప్ల‌స్ టీవీని ఈ నెల 26వ తేదీన లాంచ్ చేయ‌నున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆ ఫోన్‌, టీవీల‌కు చెందిన ప‌లు లీకైన ఫీచర్లు ఇప్ప‌టికే నెట్‌లో ప‌లు సైట్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఆ డివైస్‌ల లాంచింగ్ నేప‌థ్యంలో వ‌న్‌ప్ల‌స్ దేశ వ్యాప్తంగా ఉన్న 8 న‌గ‌రాల్లో పాప‌ప్ ఈవెంట్ల‌ను నిర్వ‌హించ‌నుంది.

హైద‌రాబాద్‌, చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు, కోల్‌క‌తా, పూణె, అహ్మ‌దాబాద్ న‌గ‌రాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో వ‌న్ ప్ల‌స్ పాప‌ప్ ఈవెంట్లు జ‌ర‌గ‌నున్నాయి. వాటిల్లో వినియోగ‌దారులు పాల్గొని వ‌న్‌ప్ల‌స్ 7టి ఫోన్‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ టీవీని ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. కాగా వ‌న్‌ప్ల‌స్ 7టి ఫోన్ల‌ను వ‌న్‌ప్ల‌స్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ల‌లో ప్రీ బుకింగ్ చేసుకునే క‌స్ట‌మ‌ర్ల‌కు 6 నెల‌ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఉచిత యాక్సిడెంట‌ల్ డ్యామేజ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందివ్వ‌నున్నారు. అలాగే వ‌న్‌ప్ల‌స్ బుల్లెట్స్ వైర్‌లెస్ 2 ఇయ‌ర్‌బ‌డ్స్ పై 50 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను ఇవ్వ‌నున్నారు.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles