వార్ప్ చార్జ్ 30 కార్ చార్జ‌ర్‌ను విడుద‌ల చేసిన వ‌న్‌ప్ల‌స్


Wed,May 15, 2019 05:03 PM

మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్.. వార్ప్ చార్జ్ 30 పేరిట ఓ నూత‌న కార్ చార్జర్‌ను నిన్న విడుద‌ల చేసింది. వ‌న్‌ప్ల‌స్ 7 సిరీస్ ఫోన్ల లాంచింగ్ ఈవెంట్‌లో ఈ చార్జ‌ర్‌ను విడుద‌ల చేశారు. రూ.1990 ధ‌ర‌కు ఈ కార్ చార్జ‌ర్ వినియోగదారుల‌కు త్వ‌ర‌లో వ‌న్‌ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్ లో ల‌భ్యం కానుంది. ఈ చార్జర్‌కు ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల దీంతో ఫోన్ల‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. అలాగే ఓవ‌ర్ క‌రెంట్‌, ఓవ‌ర్ హీటింగ్‌, షార్ట్ స‌ర్క్యూట్ ల‌ను త‌ట్టుకుంటూ టెంప‌రేచ‌ర్ ను ఆటేమేటిగ్గా కంట్రోల్ చేసుకునే విధంగా ఈ చార్జ‌ర్‌లో స‌దుపాయాల‌ను ఏర్పాటు చేశారు.

1257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles