మాంసాహారం అధికంగా తింటే కలిగే నష్టాలివే..!


Wed,November 6, 2019 10:53 AM

మాంసాహారం తినడం వల్ల మన శరీరానికి ప్రోటీన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు అందుతాయనే విషయం తెలిసిందే. దీంతోపాటు కండరాల నిర్మాణం జరుగుతుంది. శరీరానికి పోషణ అందుతుంది. అయితే మాంసాహారం తినడం వల్ల లాభాలు కలిగే మాట వాస్తవమే అయినా.. లాభం కలుగుతుంది కదా అని చెప్పి కొందరు మాంసం అతిగా తింటుంటారు. కానీ అలా చేయరాదు. దాంతో మనకు నష్టాలే కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

* మాంసాహారం అధికంగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా మారుతుంది. అజీర్ణ సమస్య వస్తుంది. మలబద్దకం ఏర్పడుతుంది. గ్యాస్, అసిడిటీ బాధిస్తాయి. జీర్ణాశయంలో అసౌకర్యంగా ఉంటుంది.

* మాంసాహారం అతిగా తినడం వల్ల శరీరం కీటోసిస్ అనబడే స్థితికి చేరుకుంటుంది. దీంతో నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

* మాంసాహారంలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి మగతను కలిగిస్తుంది. అతిగా మాంసాహారం తింటే బద్దకంగా మారుతారు. మత్తుగా అనిపిస్తుంది.

* అతిగా మాంసాహారం తినేవారికి వికారం, కడుపునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని పలువురు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

3395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles