గూగుల్ పేలో క్రికెట్ ఆడండి.. స్క్రాచ్ కార్డులు గెలవండి..


Tue,June 18, 2019 08:46 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన గూగుల్ పే యాప్ యూజర్లకు చక్కని అవకాశం కల్పిస్తున్నది. ఆ యాప్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన తేజ్ షాట్స్ అనే ఓ మినీ గేమ్‌ను ఆడి అందులో రన్స్‌ను స్కోర్ చేస్తే అందుకు తగిన విధంగా స్క్రాచ్ కార్డు వస్తుంది. అంటే.. గేమ్‌లో 100 రన్స్ కొడితే రూ.50, 500 రన్స్ కొడితే రూ.100, 1000 రన్స్ కొడితే రూ.150, 2000 రన్స్ కొడితే రూ.1000, 3000 రన్స్ కొడితే రూ.2000 విలువైన స్క్రాచ్ కార్డులు వస్తాయి. అయితే ఈ స్క్రాచ్ కార్డును అన్‌లాక్ చేయాలంటే అక్కడ సూచించే విధంగా యూజర్లు ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ స్క్రాచ్ కార్డు అన్‌లాక్ అవుతుంది. ఆపై దాన్ని స్క్రాచ్ చేసి రివార్డు పొందవచ్చు.
ఇక ఈ గేమ్ ద్వారా గూగుల్ పే యూజర్లు రూ.3300 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈ గేమ్‌ను ఎన్నిసార్లయినా ఆడవచ్చు. అందుకు పరిమితి ఏమీ లేదు. ఇక ఈ ఆఫర్‌కు జూలై 31వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. అయితే ఈ గేమ్ కేవలం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ పేను వాడుతున్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

3188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles