పబ్‌జి ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో రానున్న పబ్‌జి లైట్ గేమ్..!


Mon,June 10, 2019 10:10 PM

పబ్‌జి మొబైల్ గేమ్ ప్రియులకు శుభవార్త. ఇకపై పబ్‌జి గేమ్‌ను తక్కువ స్థాయి కాన్ఫిగరేషన్ ఉన్న పీసీలు, ల్యాప్‌టాప్‌లలోనూ ఆడవచ్చు. అందుకు గాను ఆ గేమ్ డెవలపర్ టెన్సెంట్ గేమ్స్.. పబ్‌జి లైట్ పేరిట నూతన గేమ్‌ను త్వరలో భారత్‌లో లాంచ్ చేయనుంది. కాగా ఇప్పటికే ఈ లైట్ గేమ్ థాయ్‌లాండ్, హాంగ్ కాంగ్, తైవాన్, బ్రెజిల్, బంగ్లాదేశ్ యూజర్లకు అందుబాటులోకి రాగా త్వరలో భారత్‌లోని యూజర్లకు ఈ గేమ్ లభ్యం కానుంది. ఈ మేరకు పబ్‌జి ఇండియా తన ఫేస్‌బుక్ పేజీలో ఓ ఇమేజ్‌ను పోస్ట్ చేసింది.

కాగా పబ్‌జి లైట్ వెర్షన్ గేమ్‌కు డెడికేటెడ్ జీపీయూ అవసరం లేదు. దీని వల్ల గేమ్ స్మూత్‌గా, తక్కువ స్థాయి కాన్ఫిగరేషన్ ఉన్న పీసీలోనూ రన్ అవుతుంది. ఇక ఆ పీసీ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. పబ్‌జి లైట్ ఆడాలంటే.. పీసీలో విండోస్ 7, 8 లేదా 10 ఓఎస్ (64 బిట్), ఇంటెల్ కోర్ ఐ3 సీపీయూ (2.4 గిగాహెడ్జ్ స్పీడ్), 4జీబీ ర్యామ్, ఇంటెల్ హెచ్‌డీ 4000 గ్రాఫిక్స్, 4జీబీ హార్డ్ డిస్క్ స్పేస్ ఉంటే సరిపోతుంది. అయితే భారత్‌లో పబ్‌జి లైట్ గేమ్‌ను ఈ నెల చివర్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. అప్పటి వరకు ఆ గేమ్ ప్రియులు వేచి చూడక తప్పదు..!

4047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles