నేపాల్‌లో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై నిషేధం ఎత్తివేత


Wed,April 24, 2019 06:10 PM

నేపాల్‌లో గ‌త కొద్ది రోజుల కింద‌ట అక్క‌డి ప్ర‌భుత్వం ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై నిషేధం విధించిన విష‌యం విదిత‌మే. కాగా ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ అక్క‌డి సుప్రీం కోర్టు ఇవాళ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. నేపాల్‌లోని ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ సూచ‌న‌ల మేర‌కు నేపాల్ టెలీ క‌మ్యూనికేష‌న్స్ అథారిటీ (ఎన్‌టీఏ) ఈ నెల 11వ తేదీన ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను నిషేధించాల‌ని ఆ దేశంలోని ఐఎస్‌పీఎస్‌, మొబైల్ ప్రొవైడ‌ర్లు, నెట్‌వ‌ర్క్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ఆదేశించింది. అయితే ఈ నిషేధాన్ని ఆ దేశ సుప్రీం కోర్టు ఎత్తేసింది.

నేపాల్ సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఈశ్వ‌ర్ ప్ర‌సాద్ ఖ‌తివాడా ప‌బ్‌జి మొబైల్ గేమ్ నిషేధం ఎత్తివేతపై మాట్లాడుతూ.. ప‌బ్‌జి మొబైల్ గేమ్ అన్న‌ది ఒక గేమ్ మాత్ర‌మేన‌ని, దాన్ని వినోద మాధ్య‌మంగానే చూడాల‌ని, ప్ర‌జ‌లు వినోదం కోస‌మే ఈ గేమ్‌ను ఆడుతున్నార‌ని, భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ అన్న‌ది రాజ్యాంగం అంద‌రికీ క‌ల్పించిన హ‌క్క‌ని, గేమ్‌పై నిషేధం విధిస్తే.. ఎందుకు నిషేధం విధించారో స‌రైన వివ‌ర‌ణ ఇవ్వాల‌ని, అందుకు ఆమోద‌యోగ్య‌మైన కార‌ణం తెల‌పాల‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే పబ్‌జి మొబైల్ బ్యాన్‌ చేస్తూ ఖాట్మాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు జారీ చేసిన ఆర్డర్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ నెల 10వ తేదీన ఖాట్మాండ్ కోర్టు విధించిన నిషేధం ఆమోదయోగ్యంగాలేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు నేపాల్ లో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై ఎలాంటి నిషేధం లేద‌ని అక్క‌డి అధికారులు చెబుతున్నారు.

897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles