ప‌బ్‌జి మొబైల్ బీటా వెర్ష‌న్‌.. కొత్త ఫీచ‌ర్లివే..!


Sat,March 30, 2019 11:31 AM

ఇప్ప‌టికే జాంబీ మోడ్‌, ప‌లు నూత‌న గ‌న్స్, ఇత‌ర ఫీచ‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటున్న ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో త్వ‌రలో మరిన్ని ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌బ్‌జి మొబైల్‌కు చెందిన బీటా వెర్ష‌న్ (0.12.0)లో కొత్తగా ప‌లు ఆక‌ట్టుకునే ఫీచర్ల‌ను అందిస్తున్నారు. అందులో ఈవెంట్ మోడ్‌కు బ‌దులుగా మ్యూజెన్‌స్పేస్‌/ ఇన్ఫినిటీ అనే కొత్త మోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే స‌ర్‌వైవ్ టిల్ డాన్ లో మ‌రిన్ని కొత్త మోడ్స్‌ను చేర్చారు. దీంతోపాటు కొత్త‌గా ఇన్ఫినిటీ మోడ్‌ను ఏర్పాటు చేశారు. అందులో ప్లేయ‌ర్లంద‌రూ రాత్రంతా స‌ర్‌వైవ్ అయితే చాలు తెల్ల‌వారే స‌రికి ఎంత మంది ప్లేయ‌ర్లు ఉంటే అంత మంది మ్యాచ్ విన్ అవుతారు.

ప‌బ్‌జి మొబైల్ బీటా వెర్ష‌న్‌తో కొత్త‌గా కంపానియ‌న్ సిస్ట‌మ్‌ను చేర్చారు. అందులో ప్లేయ‌ర్‌కు ఓ ప‌క్షి తోడుగా ఉంటుంది. దానికి ఫుడ్ తినిపించినా, దాంతో మ్యాచ్ ఆడినా ప్లేయ‌ర్ల‌కు ఎక్స్‌పీ ల‌భిస్తుంది. ఇక ప్లేయ‌ర్‌కు ఉన్న‌ట్లే ప‌క్షికి కూడా ప‌లు ఎమోట్స్ ఉంటాయి. ప‌క్షి లెవ‌ల్ పెరిగే కొద్దీ దానికి కూడా కొత్త‌గా ఎమోట్స్ వ‌స్తుంటాయి. అయితే ఈ ప‌క్షిని ఎనిమీలు చూడ‌లేరు. కేవ‌లం టీమ్ మేట్స్, ప్రెండ్స్‌కు మాత్ర‌మే ఆ ప‌క్షి క‌నిపిస్తుంది. ఇక స‌ర్‌వైవ్ టిల్ డాన్‌లో ప‌లు నూత‌న ఫీచర్ల‌ను ఏర్పాటు చేశారు. స్ట‌న్ గ్రెనేడ్స్‌తో జాంబీస్‌ను కూడా స్ట‌న్ చేయ‌వ‌చ్చు. కొత్త‌గా లిక్విడ్ నైట్రోజ‌న్ గ్రెనేడ్స్‌ను ఇందులో ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో ఎనిమీల‌ను ఫ్రీజ్ చేయ‌వ‌చ్చు. అలాగే వారి మూవ్‌మెంట్ స్పీడ్ కూడా త‌గ్గుతుంది.

ప‌బ్‌జి మొబైల్ బీటా వెర్ష‌న్‌లో జాంబీ మోడ్‌లో జంపింగ్ జాంబీస్‌, జాంబీ డాగ్స్‌ను ఏర్పాటు చేశారు. కొన్ని ప్ర‌త్యేక‌మైన జాంబీస్ గోడ‌ల‌ను ప‌ట్టుకుని పైకి ఎక్కుతాయి. ఇక కొత్త‌గా ఆర్‌పీజీ-7 గ‌న్‌, జంగిల్ స్టైల్ మ్యాగ‌జైన్స్‌ను ఈ బీటా వెర్ష‌న్‌లో అందిస్తున్నారు. అలాగే కొన్ని సంద‌ర్భాల్లో ప్లేయ‌ర్లు గోడ‌లు, ఇత‌ర ప్రాంతాల్లో స్ట‌క్ అయ్యే బ‌గ్‌ను కూడా ఫిక్స్ చేశారు. దీంతో ఈ స‌మ‌స్య ప్లేయ‌ర్ల‌కు ఎదురు కాదు. అదేవిధంగా.. ప్లేయ‌ర్లు త‌మ గేమ్ ఫ్రెండ్స్ మ్యాచ్ ఆడుతుంటే వారి ఆట‌ను స్పెక్టేట్ చేయ‌వ‌చ్చు. అందుకు గాను ఫ్రెండ్స్ లిస్ట్‌లో గేమ్ ఆడుతున్న వారి పేరుకు ఎదురుగా ఉండే ప్లే బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి. దీంతో ప‌బ్‌జి ఫ్రెండ్స్ ఆడే ఆట‌ను వీక్షించ‌వ‌చ్చు.

ఇక గేమ్‌లో విన్ అయ్యాక వ‌చ్చే ఆప్ష‌న్ల‌ను కూడా ఈ బీటా వెర్ష‌న్‌లో మార్చారు. విన్న‌ర్ విన్న‌ర్ చికెన్ డిన్న‌ర్ అనే స్క్రీన్ ఇక‌పై కొత్త‌గా క‌నిపిస్తుంది. అలాగే మ్యాచ్ విన్ అయ్యాక ప్లేయ‌ర్ల‌కు చికెన్ బ‌ట‌న్ ఇస్తారు. దాంతో ప్లేయ‌ర్ కావాల‌నుకున్న చోటుకు వెళ్లి ఆ బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే గ్రౌండ్‌పై చికెన్ గ్రిల్ క‌నిపిస్తుంది. అందులో చికెన్ గ్రిల్ అవుతుంటుంది. ప్లేయ‌ర్లు చికెన్ డిన్న‌ర్ సాధించాక ఆ విన్‌ను సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఈ విధంగా ఏర్పాటు చేశారు.

అయితే ఈ కొత్త ఫీచ‌ర్ల‌ను ప‌బ్‌జి మొబైల్ ఫుల్ గేమ్‌లో ఏప్రిల్ 20వ తేదీన అందిస్తార‌ని తెలిసింది. కానీ ఈ ఫీచ‌ర్ల‌ను ఇప్పుడే ఎక్స్‌పీరియెన్స్ చెందాలంటే.. ప‌బ్‌జి మొబైల్ బీటా వెర్ష‌న్ ఆడ‌వ‌చ్చు. నూత‌న 0.12.0 వెర్ష‌న్ ఇప్ప‌టికే అందుబాటులో ఉంది. పైన తెలిపిన కొత్త ఫీచ‌ర్ల‌న్నీ ఈ బీటా వెర్ష‌న్‌లో ల‌భిస్తున్నాయి. త్వ‌ర‌లో పూర్తి స్థాయిలో యూజ‌ర్లందరికీ ఈ ఫీచ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి.

1340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles