నేపాల్‌లో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై నిషేధం..!


Fri,April 12, 2019 12:13 PM

పాపుల‌ర్ మొబైల్ గేమ్ ప్లేయ‌ర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్ (ప‌బ్‌జి)ని నేపాల్ ప్ర‌భుత్వం బ్యాన్ చేసింది. ఈ గేమ్‌పై ఆ దేశంలో నిన్న‌టి నుంచి నిషేధం అమ‌లులోకి వ‌చ్చింది. పిల్ల‌ల‌పై ఈ గేమ్ చెడు ప్ర‌భావాన్ని చూపిస్తున్నందునే ఈ గేమ్‌ను నిషేధించామ‌ని నేపాల్ టెలిక‌మ్యూనికేష‌న్స్ అథారిటీ (ఎన్‌టీఏ) డిప్యూటీ డైరెక్ట‌ర్ సందీప్ అధికారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌ముఖ న్యూస్ చాన‌ల్‌తో మాట్లాడారు. ప‌బ్‌జి మొబైల్ గేమ్‌పై నిన్న‌టి నుంచే నిషేధం అమ‌లులోకి వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. ఆ దేశానికి చెందిన ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ నుంచి అందిన విన్న‌పం మేర‌కు నేపాల్‌లో ఉన్న అంద‌రు ఇంట‌ర్‌నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు, మొబైల్ ఆప‌రేట‌ర్లు, నెట్‌వ‌ర్క్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు ప‌బ్‌జి గేమ్ స్ట్రీమింగ్‌ను బ్లాక్ చేయాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే ప‌బ్‌జి మొబైల్ గేమ్ వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌న‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల చ‌దువులు, ఇత‌ర కార్య‌క‌లాపాల‌కు ఈ గేమ్ తీవ్రంగా ఆటంకం క‌లిగిస్తున్నద‌ని భావించినందునే ఈ గేమ్‌ను నిషేధించామ‌ని సందీప్ అధికారి తెలిపారు.

కాగా 2017లో ప‌లు ప్లాట్‌ఫాంల‌పై లాంచ్ అయిన ప‌బ్‌జి గేమ్ 2018 ఆరంభంలో మొబైల్ ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఈ గేమ్ దిన దిన ప్ర‌వ‌ర్ధ‌మానం అన్న‌ట్లుగా ఎంతో పాపుల‌ర్ అయింది. ముఖ్యంగా పిల్ల‌లు, యువ‌త ఈ గేమ్‌కు బానిస‌ల‌య్యారు. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలోనూ ప‌లు చోట్ల ప‌బ్‌జి మొబైల్ బారిన ప‌డి ప్రాణాల‌ను పోగొట్టుకున్న‌వారున్నారు. దీంతో ప‌లు రాష్ట్రాల్లోని న‌గ‌రాల్లో ఇప్ప‌టికే ఈ గేమ్‌ను నిషేధించినా, మ‌న దేశంలో పూర్తి స్థాయిలో ఇంకా ఈ గేమ్‌ను బ్యాన్ చేయ‌లేదు..!

953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles