ప‌బ్‌జి మొబైల్ రాయ‌ల్ పాస్ సీజ‌న్ 7 వ‌చ్చేసింది..!


Sat,May 18, 2019 04:20 PM

ప‌బ్‌జి మొబైల్ గేమ్ ప్రియుల‌కు శుభ‌వార్త‌. ఈ గేమ్‌కు గాను ఇటీవ‌లే రాయ‌ల్ పాస్ సీజ‌న్ 6 ముగియ‌గా.. ఇప్పుడు సీజ‌న్ 7 అందుబాటులోకి వ‌చ్చింది. 0.12.5 అప్‌డేట్ రూపంలో ఈ సీజ‌న్ ప్లే ప‌బ్‌జి మొబైల్ గేమ్ ప్రియుల‌కు ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది. ఈ క్ర‌మంలోనే ఈ అప్‌డేట్‌తో ప‌లు నూత‌న ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ప‌బ్‌జి మొబైల్ 0.12.5 అప్‌డేట్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి రాగా.. ఈ అప్‌డేట్‌లో ప‌లు నూత‌న ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో గేమ్‌లో అందుబాటులో ఉన్న ఈజ‌డ్ మిష‌న్ లైసెన్స్‌ను యూజ‌ర్లు పొందితే వారం త‌రువాత‌ అన్‌లాక్ అయ్యే మిష‌న్స్‌ను ముందుగానే పొంద‌వ‌చ్చు. అలాగే బ్యాటిల్ పాయింట్స్ (బీపీ)తో ఐట‌మ్స్‌ను కొనుగోలు చేసేందుకు వీలు కల్పించారు. పారాచూట్‌, ఫ్లైట్ ట్రెయిల్స్‌ను నూత‌న డిజైన్ల‌లో అందిస్తున్నారు. ఇక స్కార్పియాన్ పేరిట ఓ నూత‌న గ‌న్‌ను ఈ అప్‌డేట్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ గ‌న్‌లో 9 ఎంఎం బుల్లెట్స్ ఫిట్ అవుతాయి. అమ్మో కెపాసిటీ 20 బుల్లెట్లు. అన్ని మ్యాప్‌ల‌లో ఈ గ‌న్ ప్లేయ‌ర్ల‌కు ల‌భిస్తుంది.

ఇక మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ప్లేయ‌ర్ల కోసం డెడికేటెడ్ స‌ర్వ‌ర్ల‌ను అందుబాట‌లో ఉంచారు. దీంతోపాటు స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫీచ‌ర్‌, కేట‌గిరీ ట్యాబ్స్, గేమ్ సౌండ్స్‌ను మ‌రింత నూత‌నంగా తీర్చిదిద్దారు. ఇక కొత్త‌గా ఈ అప్‌డేట్‌లో ప‌క్షుల‌ను కంపానియ‌న్లుగా అందిస్తున్నారు. వాటిని గేమ్ లో పొంద‌వ‌చ్చు..!

1563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles