ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన రియల్‌మి 5 ప్రొ స్మార్ట్‌ఫోన్


Tue,August 20, 2019 04:52 PM

రియల్‌మి 5 ప్రొ పేరిట రియల్‌మి ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,999గా ఉంది. అలాగే టాప్ ఎండ్ వేరియెంట్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు.

రియల్‌మి 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.3 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4035 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles