శాంసంగ్ బ్లూ ఫెస్ట్ 2019 సేల్.. తగ్గింపు ధరలకు ఫోన్లు..!


Thu,August 22, 2019 10:15 AM

శాంసంగ్ ఇండియా శాంసంగ్ బ్లూ ఫెస్ట్ 2019 పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. అలాగే టీవీలు, ఇతర వస్తువులపై కూడా ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నారు. సేల్‌లో అమెజాన్ పే, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. ఇక గెలాక్సీ ఎం20, ఎం30 ఫోన్లు, గేర్ ఎస్3 ఫ్రాంటియర్ వాచ్, గెలాక్సీ ఫిట్ ఇ స్మార్ట్‌బ్యాండ్, టీ5 1టీబీ పోర్టబుల్ ఎస్‌ఎస్‌డీ తదితర ఉత్పత్తులపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. శాంసంగ్ ఇండియా ఇ-స్టోర్‌ను సందర్శించి వినియోగదారులు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

1330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles