గెలాక్సీ ఎ50 ఫోన్ ధ‌ర రూ.1500 త‌గ్గింది..!


Tue,May 28, 2019 12:19 PM

శాంసంగ్ త‌న గెలాక్సీ ఎ50 ఫోన్ ధ‌రను రూ.1500 త‌గ్గించింది. ఈ క్ర‌మంలో ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.19,990 కి బ‌దులుగా ఇప్పుడు రూ.18,490 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. అలాగే ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.22,990 కి బ‌దులుగా రూ.21,490 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో త‌గ్గిన ధ‌ర‌ల‌కే ఈ ఫోన్ వేరియెంట్ల‌ను ప్ర‌స్తుతం విక్ర‌యిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 6.4 ఇంచ్ డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్‌, ఎగ్జినోస్ 9610 ప్రాసెస‌ర్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 25, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

2799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles