గెలాక్సీ ఎ70 స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసిన శాంసంగ్


Wed,April 17, 2019 03:15 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ70 ని ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.28,990 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు మే 1వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందుకు గాను ఈ నెల 20 నుంచి 30 తేదీ మ‌ధ్య‌లో వినియోగ‌దారులు ఈ ఫోన్‌ను ప్రీ ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్‌ను ప్రీ ఆర్డ‌ర్ చేసే క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.3799 విలువైన యు ఫ్లెక్స్ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను కేవ‌లం రూ.999 కే అందిస్తారు. ఇక ఈ ఫోన్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ70 ఫీచ‌ర్లు...


6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 32, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్.

1619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles