శాంసంగ్ నుంచి కొత్త 'ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్‌'...


Tue,September 13, 2016 11:46 AM

ఒక‌ప్పుడు ఫ్లిప్ ఫోన్లు మొబైల్ వినియోగ‌దారుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకున్నాయో అంద‌రికీ తెలిసిందే. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ల రాక‌తో ఫ్లిప్ ఫోన్లు మ‌రుగున ప‌డిపోయాయి. ఈ క్ర‌మంలో శాంసంగ్ ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ క‌లిగిన ఓ ఫ్లిప్ ఫోన్‌ను 2013లో విడుద‌ల చేసింది. కానీ అది అంత‌గా పాపుల‌ర్ కాలేదు. అయితే ఇటీవ‌లి కాలంలో హై కాన్ఫిగ‌రేష‌న్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు మంచి డిమాండ్ ఉండ‌డంతో శాంసంగ్ దాన్ని దృష్టిలో ఉంచుకుని మ‌రోసారి నూత‌న ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్‌ను హై కాన్ఫిగ‌రేష‌న్‌తో అందించ‌డానికి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలోనే త‌న నూత‌న ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్ 'గెలాక్సీ ఫోల్డ‌ర్ 2'ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. కానీ దీని ధ‌ర వివ‌రాల‌ను మాత్రం వెల్లడించ‌లేదు.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ‌ర్ 2 ఫీచ‌ర్లు...

  • 3.8 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 800 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 1.4 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెస‌ర్‌, అడ్రినో 308 గ్రాఫిక్స్
  • 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
  • 8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
  • 1950 ఎంఏహెచ్ బ్యాట‌రీ

  • 1256
    Follow us on : Facebook | Twitter

    More News

    VIRAL NEWS

    Featured Articles

    Health Articles