శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 విడుదల నేడే..!


Wed,August 7, 2019 11:15 AM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్.. నోట్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 10ను ఇవాళ విడుదల చేయనుంది. భారత కాలమానం ప్రకారం నేటి అర్ధరాత్రి 1.30 గంటలకు (ఆగస్టు 8) న్యూయార్క్‌లో శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 10 ఈవెంట్‌ను నిర్వహించనుంది. అందులో నోట్ 10 వివరాలను ఆ సంస్థ వెల్లడించనుంది. ఇక ఈ సారి నోట్ 10, నోట్ 10 ప్లస్ పేరిట రెండు నోట్ స్మార్ట్‌ఫోన్ వేరియెంట్లను లాంచ్ చేయనున్నారు. అలాగే గెలాక్సీ బుక్ ఎస్ పేరిట శాంసంగ్ ఓ నూతన ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేస్తుందని తెలిసింది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ఈవెంట్‌ను శాంసంగ్ వెబ్‌సైట్‌తోపాటు యూట్యూబ్‌లోనూ లైవ్‌లో వీక్షించవచ్చు. అయితే ఈ సారి నోట్ 10, నోట్ 10 ప్లస్ స్మార్ట్‌ఫోన్లతోపాటు నోట్ 10 ప్లస్ 5జీ వేరియెంట్‌ను కూడా లాంచ్ చేస్తారని తెలిసింది. కాగా గెలాక్సీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో 6.3 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9825 చిప్‌సెట్ లేదా స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 12, 16, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తదితర ఫీచర్లను అందిస్తారని తెలుస్తుండగా.. నోట్ 10 ధర 999 యూరోలు (దాదాపుగా రూ.77,400)గా ఉండనుందని సమాచారం.

ఇక గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫోన్‌లో 6.8 ఇంచ్ డిస్‌ప్లే, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ ర్యామ్ తదితర ఫీచర్లను అందిస్తారని తెలుస్తుండగా, 5జీ వేరియెంట్‌లోనూ ఇవే ఫీచర్లను అందివ్వనున్నారని సమాచారం. ఇక నోట్ 10 ప్లస్ ధర 1150 యూరోలు (దాదాపుగా రూ.89,100) ఉండనుందని తెలిసింది. అలాగే గెలాక్సీ బుక్ ఎస్ ల్యాప్‌టాప్‌లో స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లను అందిస్తారని తెలిసింది.

కాగా భారత్‌లో ఈ నెల 20వ తేదీన గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫోన్లను శాంసంగ్ విడుదల చేస్తుందని సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ముందుగా విక్రయిస్తారట. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ ఫోన్లకు గాను విక్రయాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

1475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles