గెలాక్సీ ట్యాబ్ ఎస్5ఇ ట్యాబ్‌ను విడుదల చేసిన శాంసంగ్


Mon,June 24, 2019 04:59 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్5ఇ ని ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 10.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్‌ను అందిస్తున్నారు. 7040 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్5ఇ ట్యాబ్లెట్ బ్లాక్, సిల్వర్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో రూ.35,999 ప్రారంభ ధరకు లభిస్తున్నది. అదే ఈ ట్యాబ్లెట్‌కు చెందిన ఎల్‌టీఈ వెర్షన్ అయితే రూ.39,999 ధరకు లభిస్తున్నది. ఇక ఈ ట్యాబ్‌ను కొన్నవారికి రూ.7,999 విలువైన బుక్ కవర్ కీబోర్డ్‌ను రూ.3500 కే అందివ్వనున్నారు.



శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్5ఇ ఫీచర్లు...


10.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2560 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డాల్బీ అట్మోస్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 7040 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles