గెలాక్సీ ఎస్‌10 ఫోన్ల‌పై క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు..!


Sat,April 13, 2019 04:33 PM

శాంసంగ్ కంపెనీ త‌న గెలాక్సీ ఎస్‌10 ఫోన్ల‌పై క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ది. గెలాక్సీ ఎస్10, ఎస్‌10 ప్ల‌స్, ఎస్‌10ఇ ఫోన్ల‌కు ఎక్స్‌ఛేంజ్ బోన‌స్‌ను కూడా శాంసంగ్ అందిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో వినియోగ‌దారులు త‌మ పాత స్మార్ట్‌ఫోన్ల‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే అద‌నంగా రూ.6వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే బ‌జాజ్ ఫైనాన్స్ సంస్థ‌తో శాంసంగ్ భాగ‌స్వామ్యం అయినందున గెలాక్సీ ఎస్‌10ఇ ఫోన్‌ను 9 నెల‌ల ఈఎంఐ స్కీంతో కొనుగోలు చేస్తే రూ.4వేల క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. గెలాక్సీ ఎస్‌10, ఎస్‌10 ప్ల‌స్ ఫోన్ల‌ను బ‌జాజ్ ఫైనాన్స్ స్కీంల‌తో కొనుగోలు చేస్తే రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఈ ఫోన్ల‌ను కొనుగోలు చేసినా క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది.

కాగా గెలాక్సీ ఎస్‌10 ఫోన్ల‌ను కొనుగోలు చేసే వారికి రూ.9,990 విలువైన గెలాక్సీ బ‌డ్స్‌ను కేవ‌లం రూ.4,999 కే అందివ్వ‌నున్నారు. ఇక రూ.22,900 విలువైన గేర్ ఎస్‌3 ఫ్రాంటియ‌ర్ స్మార్ట్‌వాచ్ రూ.9,999 కే ల‌భిస్తుంది. ఈ మూడు ఫోన్ల‌ను ఏ మాధ్య‌మంలో కొనుగోలు చేసినా పైన తెలిపిన ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చ‌ని శాంసంగ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా గెలాక్సీ ఎస్‌10 ప్రారంభ ధ‌ర రూ.66,900 ఉండ‌గా, గెలాక్సీ ఎస్10 ప్ల‌స్ ప్రారంభ ధ‌ర రూ.73,900గా ఉంది. అలాగే గెలాక్సీ ఎస్10ఇ రూ.55,900 ప్రారంభ ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

1635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles