ఇకపై గెలాక్సీ నోట్, ఎస్ సిరీస్ ఫోన్లు రావు..? శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..?


Wed,September 18, 2019 12:03 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన గెలాక్సీ ఎస్ సిరీస్, నోట్ సిరీస్ ఫోన్లకు ఇకపై ఫుల్‌స్టాప్ పెట్టనున్నట్లు తెలిసింది. ఆ సిరీస్‌లో ఇకపై కొత్త ఫోన్లను శాంసంగ్ విడుదల చేయబోవడం లేదని తెలిసింది. దీంతో గెలాక్సీ ఎస్10, గెలాక్సీ నోట్ 10లతోనే ఆ సిరీస్‌లు ముగియనున్నాయి. అయితే శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది.

గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఇప్పటి వరకు 10 ఫోన్లను శాంసంగ్ విడుదల చేయగా, నోట్ సిరీస్‌లో 9 ఫోన్లు వచ్చాయి. అయితే ఎప్పుడు ఈ రెండు సిరీస్‌లలో కొత్త ఫోన్లను విడుదల చేసినా వాటిల్లో అందించే ఫీచర్లు దాదాపుగా ఒకే రకంగా ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు గెలాక్సీ నోట్ ఫోన్లను కాకుండా గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లను కొనేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారట. ఈ క్రమంలోనే ఎస్ సిరీస్, నోట్ సిరీస్‌లకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ రెండు సిరీస్‌లను కలిపి గెలాక్సీ వన్ పేరిట ఓ కొత్త సిరీస్‌ను లాంచ్ చేసే యోచనలో శాంసంగ్ ఉన్నట్లు తెలిసింది. ఇకపై గెలాక్సీ వన్ సిరీస్‌లోనే శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు విడుదలవుతాయని సమాచారం. మరి ఈ విషయంపై శాంసంగ్ తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles