భారత్‌లో గెలాక్సీ నోట్ 10 ఫోన్ల ధరలివే..!


Sat,August 10, 2019 11:57 AM

శాంసంగ్ సంస్థ గెలాక్సీ నోట్ సిరీస్‌లో తన నూతన స్మార్ట్‌ఫోన్లు నోట్ 10, నోట్ 10 ప్లస్‌లను తాజాగా విడుదల చేసిన విషయం విదితమే. న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో శాంసంగ్ ఈ ఫోన్లను లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్లకు గాను శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, టాటా క్లిక్‌లలో ప్రీ ఆర్డర్లను ప్రారంభించామని శాంసంగ్ తెలిపింది. ఈ నెల 22వ తేదీ వరకు ప్రీ ఆర్డర్లను స్వీకరిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ నెల 23వ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా దేశాల మార్కెట్లలోనూ ఈ ఫోన్లను విక్రయించనున్నట్లు శాంసంగ్ తెలియజేసింది.

కాగా భారత్‌లో గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫోన్ల ధరలను కూడా శాంసంగ్ వెల్లడించింది. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే...
* శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 (8జీబీ + 256జీబీ) - రూ.69,999
* శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12జీబీ + 256జీబీ) - రూ.79,999
* శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12జీబీ + 512జీబీ) - రూ.89,999

ఇక ఈ ఫోన్లపై పలు లాంచింగ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్లను ప్రీ బుకింగ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఐసీఐసీఐ కార్డులతో ప్రీబుకింగ్ చేసి ఈ-కామర్స్ సైట్లలో ఈ ఫోన్లను కొంటే రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే ఈ ఫోన్లను కొన్న యూజర్లకు రూ.19,990 ధర కలిగిన గెలాక్సీ వాచ్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ.9,999 ధరకే అందివ్వనున్నారు.

1271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles