ఆగస్టు 7న విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 10


Tue,July 2, 2019 05:09 PM

శాంసంగ్ కంపెనీ తన నూతన నోట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 10 ను ఆగస్టు 7వ తేదీన విడుదల చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 7వ తేదీన న్యూయార్క్‌లో నిర్వహించనున్న శాంసంగ్ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. కాగా ఈ నోట్ 10కు గాను పలు భిన్నమైన వేరియెంట్లను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.

గెలాక్సీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ను 6.25, 6.75 ఇంచ్ మోడల్స్‌లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అలాగే మరొక మోడల్‌లో 5జీ ఫీచర్ ఇవ్వనున్నారని తెలిసింది. ఇక ఈ వేరియెంట్లలో అధునాతన స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ లేదా ఎగ్జినోస్ 9 సిరీస్ 9820 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే నోట్ 10 ప్లస్ పేరిట విడుదల కానున్న ఓ వేరియెంట్‌లో మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌ను కూడా ఇవ్వనున్నారని తెలిసింది.

కాగా నోట్ 10ప్లస్ వేరియెంట్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందివ్వనున్నారని తెలిసింది. అలాగే వైర్‌లెస్ పవర్‌షేర్ ఫీచర్ ద్వారా ఇతర డివైస్‌లను చార్జింగ్ చేసుకునే విధంగా ఓ కొత్త ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇక శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను ఆ సంస్థకు చెందిన యూట్యూబ్ చానల్‌లో ఆగస్టు 7వ తేదీన రాత్రి వీక్షించవచ్చు.

1481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles