భారత్‌లో దూసుకెళ్తున్న మొబైల్ గేమింగ్ రంగం...


Mon,November 9, 2015 03:28 PM

భారత్‌లో మొబైల్ గేమింగ్ రంగం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. దాదాపు 150 మిలియన్ డాలర్లకు ఈ రంగం చేరుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2015 చివరికల్లా భారత్‌లో 200 మిలియన్లకు మొబైల్ గేమర్ల సంఖ్య చేరుకుంటుందని అంటున్నారు. ఇంటర్నెట్ ఆధారిత గేమ్‌లను ఆడేవారి సంఖ్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 నుంచి 50 మిలియన్ల మంది స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారని, దీని వృద్ధి రేటు 40 నుంచి 50 శాతం వరకు ఉందని అన్నారు.

గేమింగ్ కన్సోల్స్‌లో గేమ్‌లు ఆడుతున్న వారు 3 నుంచి 4 మిలియన్ల మంది ఉంటారని అన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 3వేల సైబర్‌కేఫ్‌లు గేమింగ్ హోస్ట్‌లుగా సేవలందిస్తున్నాయని తెలిపారు. కాగా డీవోటీఏ, కౌంటర్‌ైస్ట్రెక్, లీగ్ ఆఫ్ లిజెండ్స్, వరల్డ్ ఆఫ్ ట్యాంక్స్ వంటి గేమ్‌లను భారత్‌లో ఎక్కువగా ఆడుతున్నారని పేర్కొంటున్నారు. భారత్‌లో ప్రస్తుతం దాదాపు 200కి పైగా గేమ్ డెవలప్‌మెంట్ స్టూడియోలు ఉన్నాయని, ఇవి ఎక్కువగా ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో తమ గేమ్స్‌ను పబ్లిష్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

6844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles