ఆ కార్లను హ్యాక్‌ చేస్తే భారీ నజరానా..!


Mon,January 13, 2020 05:12 PM

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా ఔత్సాహికులకు ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన మోడల్‌-3 కార్లను హ్యాక్‌ చేసిన వారికి భారీ నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ కార్లను హ్యాక్‌ చేసిన వారికి ఒక మోడల్‌-3 కారుతోపాటు 1 మిలియన్‌ డాలర్ల నగదు బహుమతిని కూడా అందజేస్తామని తెలిపింది. కెనడాలోని వ్యాంకోవర్‌లో జరగనున్న వార్షిక కార్యక్రమంలో హ్యాకర్లు పాల్గొని అందులో పోటీ పడవచ్చని ఆ కంపెనీ తెలిపింది. కాగా గతేడాది మార్చిలో జరిగిన ఇదే తరహా పోటీలో మోడల్‌-3 కారులోని ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థను కొందరు హ్యాక్‌ చేసి అందులో ఉన్న లోపాలను వెల్లడించారు. దీంతో ఆ హ్యాకర్లు 35వేల డాలర్ల నగదుతోపాటు ఒక కారును కూడా బహుమతిగా పొందారు. ఇక ఈ సారి ఆ నగదు బహుమతిని టెస్లా భారీగా పెంచడం విశేషం.

819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles