ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లపై ఆసక్తి చూపని వినియోగదారులు..?


Sun,September 22, 2019 01:51 PM

సాధారణంగా ప్రతి ఏటా ఆపిల్ కంపెనీ నూతన ఐఫోన్లను విడుదల చేస్తుందంటే చాలు.. ఒక్క రోజు ముందు నుంచే ఆపిల్ స్టోర్స్ వద్ద పెద్ద ఎత్తున ఐఫోన్ ప్రియులు భారీ ఎత్తున క్యూలు కట్టి ఆ ఫోన్లను కొనేందుకు ఎదురు చూస్తుంటారు. ఇక కొందరైతే ఒక మెట్టు పైకి ఎక్కి ఏకంగా శరీరంలోని కిడ్నీలను అమ్ముకుని మరీ ఐఫోన్లను కొంటుంటారు. ఐఫోన్లకు ఒకప్పుడు క్రేజ్ అంతగా ఉండేది. కానీ ఈ సారి మాత్రం ఆ ఆసక్తంతా తగ్గియిపోయినట్లు కనిపిస్తున్నది.

చైనా మార్కెట్‌లో ఆపిల్ కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 11 ఫోన్ల పట్ల వినియోగదారులు అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ స్టోర్స్ ఎదుట క్యూలలో బారులు తీరి కనిపించే ఐఫోన్ డై హార్డ్ ఫ్యాన్స్ ఇప్పుడు తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. ఫోన్ల సేల్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయా స్టోర్స్ వద్ద ఒక డజనుకు మించి కస్టమర్లు కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సారి విడుదలైన ఐఫోన్ల పట్ల వినియోగదారులు అంతగా ఆసక్తిని చూపించడం లేదని స్పష్టమవుతోంది.

ఐఫోన్ 11 ఫోన్ల పట్ల వినియోగదారులు ఆసక్తి చూపించకపోవడానికి కారణం.. అంతకు దీటైన ఫీచర్లు కలిగిన ఫోన్లను చైనా కంపెనీలైన ఒప్పో, వివో, షియోమీ, హువావేలు విడుదల చేస్తుండడమేనని తెలిసింది. నూతనంగా వచ్చిన ఐఫోన్లలో ఆపిల్ కొత్తగా అందించిన ఫీచర్లేమీ లేవు. కాకపోతే ఐఓఎస్ 13లో కొన్ని ఆకట్టుకునే ఫీచర్లున్నాయి.. అంతే.. ఓవరాల్‌గా చూస్తే పాత సీసాలో కొత్త సారా పోసినట్లు ఐఫోన్ 11 ఫోన్లు ఉన్నాయని వినియోగదారులు భావిస్తున్నారట. అందుకనే ఆ ఫోన్ల పట్ల వారిలో ఆసక్తి తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మరిన్ని రోజులు గడిస్తే గానీ.. ఈ విషయంలో ఒక స్పష్టత రాదని వారు అభిప్రాయపడుతున్నారు..!

1933
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles