ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన వివో వి17 ప్రొ స్మార్ట్‌ఫోన్


Sat,September 21, 2019 01:30 PM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి17 ప్రొను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగంగా పనిచేస్తుంది. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమర్చారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో తక్కువ కాంతిలోనూ అద్భుతమైన సెల్ఫీలు తీసుకోవచ్చు.

ఈ ఫోన్‌కు వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. 128 జీబీ స్టోరేజ్ అందిస్తున్నారు. కానీ మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ లేదు. అలాగే ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4100 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. మిడ్‌నైట్ ఓషియన్, గ్లేసియర్ ఐస్ కలర్ ఆప్షన్లలో విడుదలైన ఈ ఫోన్ రూ.29,990 ధరకు వినియోగదారులకు ఈ నెల 27వ తేదీ నుంచి లభ్యం కానుంది.

వివో వి17 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.44 ఇంచుల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles