HomeLATEST NEWSVivo Z1 Pro launching in India soon

త్వరలో భారత్‌లో విడుదల కానున్న వివో జడ్1 ప్రొ స్మార్ట్‌ఫోన్

Published: Sun,June 16, 2019 05:36 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్1 ప్రొ ను భారత్‌లో అతి త్వరలో విడుదల చేయనుంది. ఇందులో అధునాతన స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 32 మెగాపిక్సల్ ఇన్ డిస్‌ప్లే కెమెరాను అమర్చారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. రూ.14,075 ప్రారంభ ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

వివో జ1 ప్రొ ఫీచర్లు...


6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
2744
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology