ఈ నెల 24న విడుద‌ల కానున్న వివో జడ్‌5ఎక్స్ స్మార్ట్‌ఫోన్


Wed,May 22, 2019 10:59 AM

మొబైల్స్ త‌యారీదారు వివో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వివో జ‌డ్‌5ఎక్స్‌ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయ‌నుంది. ఇందులో పంచ్ హోల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అమ‌ర్చారు. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో ఉన్న కెమెరాల‌లో ఒక కెమెరా అల్ట్రా వైడ్ లెన్స్ సిస్ట‌మ్‌తో ప‌నిచేస్తుంది. ఇక ఈ ఫోన్ ఫాంట‌మ్ బ్లాక్‌, మిడ్‌నైట్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కానుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ ల‌భ్యం కానుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీల‌ను కూడా ఏర్పాటు చేశారు. కాగా ఈ ఫోన్ ధ‌ర వివ‌రాలను ఇంకా వెల్ల‌డించ‌లేదు. విడుద‌ల రోజే ఆ వివ‌రాలు తెలుస్తాయి..!

1597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles