ఇక వాట్సప్‌లో ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట.. త్వరలో రానున్న కొత్త ఫీచర్లు


Thu,March 21, 2019 03:40 PM

వాట్సప్‌లో షేర్ అయ్యే ప్రతి విషయాన్ని మనం నమ్మలేం. ఎందుకంటే అందులో నిజం ఉండొచ్చు.. అబద్ధం ఉండొచ్చు. వాట్సప్‌లో షేర్ అయ్యే లింక్స్‌లోనూ చాలామటుకు ఫిషింగ్ లింక్స్ ఉంటాయి. సైబర్ నేరగాళ్లు యూజర్ల డేటాను దొంగలించడం కోసం వేసే ఎత్తుగడలు అవి. వాటిని వాట్సప్‌లో షేర్ చేస్తూ ఆఫర్ల పేరుతో ప్రలోభపెడుతూ ఫేక్ లింక్స్ లాంటివి పెడుతుంటారు. ఇలా.. వాట్సప్‌లో వచ్చే ఏ వార్తలో అయినా నిజమెంత? అబద్ధమెంత? అని ఎలా తెలుసుకోవాలి. దాని కోసం వాట్సప్ చాలారోజుల నుంచి కష్టపడుతోంది. దానికి ఒక సొల్యూషన్‌ను కూడా తీసుకొచ్చింది. కొన్ని ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాక‌పోతే అవి ఇంకా టెస్టింగ్ ద‌శ‌లోనే ఉన్నాయి. దానిలో ఒకటి సెర్చ్ ఇమేజ్ టూల్. దీన్నే రివర్స్ సెర్చ్ ఇమేజ్ టూల్ అని కూడా పిలుస్తారు.

ఫేక్ ఇమేజ్‌లను కనిపెట్టడం కోసం... వాట్సప్‌లో షేర్ అయిన ఏదైనా ఇమేజ్‌ను తీసుకొని దాని మీద లాంగ్ ప్రెస్ చేయాలి. దీంతో సెర్చ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఆ ఇమేజ్ రియల్‌దా? ఫేకా? ఇంకా ఆ ఇమేజ్‌కు సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ ఫీచర్‌ను వాట్సప్ ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది. బీటా యూజర్లకు కూడా ఈ ఆప్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

సెర్చ్ ఇమేజ్ టూల్‌తో పాటు వాట్సప్ మరికొన్ని టూల్స్‌ను కూడా డెవలప్ చేసింది. వాటిలో ఇన్‌యాప్ బ్రౌజర్, గ్రూప్ ఇన్విటేషన్, అడ్వాన్స్‌డ్ సెర్చ్ టూల్, డౌన్‌లోడ్ సింగిల్ స్టిక్కర్ ఉన్నాయి.

ఇన్‌యాప్ బ్రౌజర్ అంటే.. వాట్సప్‌లో ఏదైనా లింక్ షేర్ అయితే.. ఆ లింక్‌ను క్లిక్ చేసినప్పుడు వాట్సప్ డీఫాల్ట్ బ్రౌజర్‌లో ఓపెన్ అవడం అన్నమాట. ప్రస్తుతానికి లింక్ క్లిక్ చేస్తే ఫోన్‌లోని డీఫాల్ట్ బ్రౌజర్‌లో లింక్ ఓపెన్ అవుతుంది. ఇన్‌యాప్ బ్రౌజర్ విజయవంతం అయితే త్వరలోనే వాట్సప్ డీఫాల్ట్ బ్రౌజర్‌లోనే లింక్స్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు సపరేట్ ఇన్‌యాప్ బ్రౌజర్స్ ఉన్నాయి. వాట్సప్ ఇన్‌యాప్ బ్రౌజర్ లాంచ్ అయితే.. ఆ లింక్ ఫేక్ అయినా.. ఆ లింక్‌కు వైరస్ ఇన్‌ఫెక్ట్ అయినా వాట్సప్ వెంటనే యూజర్లకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఫేక్ లింక్స్‌ను కనిపెట్టే చాన్స్ ఉంటుంది. వైరస్ సోకిన లింక్స్‌ను ఓపెన్ చేయకుండా ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంది.

గ్రూప్ ఇన్విటేషన్


చాలామందికి నచ్చే ఫీచర్ ఇది. ఈ ఫీచర్ వల్ల ఏదైనా వాట్సప్ గ్రూప్‌లో యూజర్‌ను యాడ్ చేయడానికి కుదరదు. అంటే ఈ ఫీచర్ ద్వారా ఏదైనా గ్రూప్‌లో జాయిన్ అవ్వకుండా లేదా జాయిన్ అయ్యేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి రిక్వెస్ట్ కూడా పంపించవచ్చు. 72 గంటల్లో ఆ రిక్వెస్ట్‌కు రెస్పాండ్ కాకపోతే ఆ రిక్వెస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది.

అడ్వాన్స్‌డ్ సెర్చ్ టూల్


పేరులో ఉన్నట్టుగానే వాట్సప్‌లోని ఫైల్స్ సెర్చ్ చేసుకోవడం కోసం వాడే ఫీచర్ ఇది. ప్రస్తుతం కీవర్డ్స్ ఆధారంగా వాట్సప్‌లో సమాచారం కోసం వెతకొచ్చు. కొత్తగా వచ్చే ఫీచర్ వల్ల స్పెసిఫిక్ ఫైల్స్ అయినటువంటి ఫోటోలు, జీఐఎఫ్స్, లింక్స్, వీడియోలు, డాక్యుమెంట్స్, ఆడియోను వెతకొచ్చు. ప్రతీ కేటగిరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో కూడా అడ్వాన్స్‌డ్ సెర్చ్ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు.

డౌన్‌లోడ్ సింగిల్ స్టిక్కర్


ఈ ఫీచర్‌తో యూజర్లు స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సింగిల్ స్టిక్కర్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే స్టిక్కర్ ప్యాక్ నుంచి కావాల్సిన స్టిక్కర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వాట్సప్‌లో ఉపయోగించుకోవచ్చు.

1845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles