భార‌త్‌లో ఎంఐ పే మొబైల్ పేమెంట్ సేవ‌లు షురూ..!


Tue,March 19, 2019 03:04 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ భార‌త్‌లో ఇవాళ ఎంఐ పే సేవ‌ల‌ను ప్రారంభించింది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లోనే షియోమీ ఈ సేవ‌ల‌పై ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే నేటి నుంచి భార‌త్‌లోని స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు ఎంఐ పే సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇక‌ షియోమీ ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగ‌స్వామ్య‌మై ఆ సేవ‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో యూజ‌ర్లు ఎంఐ పే యాప్‌ను ఉప‌యోగించి ఆన్‌లైన్‌లో యూపీఐ ద్వారా న‌గ‌దును సుల‌భంగా ఇత‌రుల‌కు పంప‌వ‌చ్చు. ఇత‌రుల నుంచి న‌గ‌దును స్వీక‌రించ‌వ‌చ్చు. అలాగే బిల్ పేమెంట్స్, రీచార్జిలు కూడా చేసుకోవ‌చ్చు.

1418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles