చిల్లేపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద రూ. 11.5 లక్షలు పట్టివేత

Fri,October 18, 2019 08:16 PM

సూర్యాపేట : నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం తనిఖీ అధికారులు రూ. 11.5 లక్షలు పట్టుకున్నట్లు ఎస్‌ఎస్‌టీ అధికారి టి. శ్రీనివాస్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గురజాల నుంచి వస్తున్న ఇన్నోవా కారును చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయగా ఇద్దరి వద్ద రూ.11.5లక్షల నగదు గుర్తించారు. గురజాలకు చెందిన దివ్వల సాంబ శివరావు తనకు బంగారం షాపు ఉందని, ఆ డబ్బు తీసుకుని సూర్యాపేట మద్యం దుకాణాల డ్రాలో పాల్గొనేందుకు వెళ్తున్నానని తెలిపారు. దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన మరో వ్యక్తి వంకాయల లక్ష్మయ్య గుప్త కూడా అదే కారులో ఉన్నాడు. తాను పోస్టల్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నానని, నేరేడుచర్ల పోస్టాఫీసులో సేవింగ్‌ చేసేందుకు వెళుతున్నట్లు లక్ష్మయ్య తెలిపాడు. ఇద్దరు పొంతనలేని సమాధానాలు చెప్పడం, ఇద్దరు వేర్వేరు ప్రాంతానికి చెందిన వారు కావడంతో నగదు సీజ్‌ చేసి రిటర్నింగ్‌ అధికారికి పంపినట్లు తెలిపారు.

1010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles