డ్రైవింగ్ లైసెన్స్‌ లేని 23 మందికి జైలు...

Tue,December 19, 2017 09:57 PM

హైదరాబాద్ : క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ కోసం సైబరాబాద్, రాచకొండ ట్రాఫీక్ పోలీసులు వాహనదారులపై కఠిన చర్యలను తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో సైబరాబాద్ ట్రాఫీక్ పోలీసులు 23 మంది లైసెన్స్‌స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని, ముగ్గురి పై ఉల్లంఘనల కింద కేసును నమోదు చేసి కూకట్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు 26 మందికి ఒక రోజు జైలు శిక్షను విధించింది. ఇక రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత 15 రోజులుగా నిర్వహించిన డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం వాహనదారులపై 307 కేసులను నమోదు చేశారు వీటిలో 33 మంది మందుబాబులకు ఒకరోజు జైలు, మరో 15 మందికి సామాజిక సేవ శిక్షను స్థానిక కోర్టులు విధించాయి. అదే విధంగా ఓఆర్‌ఆర్‌పై మద్యం తాగి వాహనాలను నడిపించేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై కూడా ట్రాఫీక్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఇక ఓఆర్‌ఆర్ పై అతి వేగంతో ప్రయాణీస్తున్న 3254 వాహనదారులపై కేసులను నమోదు చేసి ఒక్కొక్కరికి రూ.1435 చొప్పున చలాన్‌ను విధించారు.


2020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles