విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

Mon,September 16, 2019 10:20 PM

-బోర్ పైపు తీస్తుండగా ఘటన
-ఏల్పుగొండ గ్రామంలో విషాద ఛాయలు


కామారెడ్డి : బోర్ పైపులు తీస్తుండగా 11 కే.వీ వైర్ పైపులకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందిన విషాదకరమైన సంఘటన సోమవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఏల్పుగొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై బోయిని మురళి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మారగాని స్వామిగౌడ్ పంట పొలంలో బోర్‌మోటర్ చెడిపోయింది. పైపులు, మోటార్ తీయించడానికి గ్రామానికి చెందిన అన్నమనేని లక్ష్మణ్‌రావు(62), ఐలేని మురళీధర్‌రావు(55), ఇమ్మడి సత్యనారాయణ(51) ముగ్గురితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ముగ్గురు కలిసి స్వామిగౌడ్ పొలంలో ఉన్న బోర్‌మోటార్‌లో నుంచి అన్ని పైపులు తీశారు. చివరగా మోటార్‌ను తీసేటప్పుడు బ్యాలెన్స్ తప్పి పైన ఉన్న 11 కే.వీ విద్యుత్ వైరుకు పైపు తగలడంతో ముగ్గురికి షాక్ కొట్టి అక్కడిక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు.

ఏండ్ల నుంచి ఇదే పని చేస్తూ..
మురళీధర్‌రావు, లక్ష్మణ్‌రావు, సత్యనారాయణ ముగ్గురు బోర్‌పైపులు తీసే పనిని దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని రైతులకు సంబంధించి ఎవరి పొలంలో బోరుమోటార్ చెడిపోయినా వీరే బాగు చేసేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. వీరికున్న పొలంలో పనులు చేసుకుంటూ మిగతా సమయాల్లో చెడిపోయిన మోటార్ల పైపులు తీస్తారని గ్రామస్తులు తెలిపారు.

845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles