400 మామిడిచెట్లు దగ్ధం..

Tue,May 7, 2019 05:14 PM


మంచిర్యాల: నెన్నెల మండలం గంగారం గ్రామం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామ సమీపంలోని మామిడి తోటలో ఉన్న కరెంటు తీగలు ఒకదానికొకటి తగలి మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెట్లపై పడటంతో సుమారు నాలుగు వందలకు పైగా మామిడి చెట్లు కాలిపోయాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటన జరిగిన సమయంలో మనుషులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

1059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles