ఖమ్మం @ 45

Sun,May 26, 2019 09:34 PM

45 degree temperature in khammam

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆందోళనలో జిల్లా వాసులు
ఖమ్మం: జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. రోహిణి కార్తె ఆరంభం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచే 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో జిల్లా మొత్తం ఉగ్రోష్ణంగా మారింది. ఎండలు తీవ్రతరమవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంకే బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం వడగాల్పులు సాయంత్రం ఉక్కపోతతో జనం తట్టుకోలేపోతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచిత మజ్జిగ, చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో ప్రజలు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకుంటూ ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు.

3289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles